ఇస్లాం బోధనలు, సదా అనుసరణీయం..

ఇస్లాం బోధనలు, సదా అనుసరణీయం..

మౌలానా ముస్తాన్ నద్వీ

ఆంధ్రప్రభ, విజయవాడ : రమజాన్ పర్వ దినం మనకు తక్వా (అల్లాహ్ భయం), సహనం దానగుణం నేర్పుతుందని ప్రఖ్యాత ఇస్లామిక్ పండితుడు జనాబ్ అబ్దుల్ ముస్తాన్ నద్వీ పేర్కొన్నారు. ముస్లిం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈద్ ప్రార్థనలో ఆయన ధార్మిక ప్రవచనం చేశారు. హఫీజ్ రియాజ్ సాహెబ్ ఉర్దూ సందేశం అరబ్బీలో ఖుత్బా మరియు నమాజ్ చేయించారు ఆయన ప్రసంగంలో ఇస్లాం ధర్మం పరస్పర ప్రేమానురాగాలను, సోదరభావాన్ని , ఐక్యతను చాటుతుందన్నారు.

కుల,మతాలకు అతీతంగా మానవ సేవకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రమజాన్ ఉపవాసాలు హృదయ మాలిన్యాన్ని దూరం చేస్తాయన్నారు. రమజాన్ మాసం సమస్త మానవాళి జీవితాల్లో శాంతి, సంతోషం మరియు కరుణను కోరుకుంటుందన్నారు. రమజాన్ మాసం అందించే స్ఫూర్తి ఎల్లవేళలా కొన సాగాలని, మానవులారా అందరూ కలిసి మెలిసి జీవించాలి ఇస్లాం బోధనలను సమస్త మానవాళి జీవితాల్లో వెలుగు రేఖలు ప్రసరింప చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.ప్రపంచ శాంతి కోసం ప్రత్యక ప్రార్థనలు చేశారు

ప్రధాన కార్యదర్శి షేక్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ ….

నిరుపేదలను గుర్తించి కుల మతాలకు అతీతంగా అవస రార్ధుల అవసరాలు తీర్చడం సహాయం చేయడం మానవ సంబంధాలను కొనసాగించటం ద్వారా ప్రజల మధ్య మత సామరస్యాన్ని పెంపొందించడం ఐక్యత సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు
ఒకరి పండుగలలో మరొకరు పాల్గొనటం ద్వారా రాజకీయంగా ఏర్పడుతున్న దూరాన్ని తగ్గించుకోవటం మానవత్వాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేయాలి
నమాజ్ ఏర్పాట్లకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి మునిసిపల్ శాఖ వారికి పోలీసు శాఖ వారికి ధన్యవాదాలు తెలియచేసారు.వైయస్సార్సీపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్,

షేక్ మునీర్ అహ్మద్ (జనరల్ సెక్రటరీ)
డా కాలేషా వలి (ప్రెసిడెంట్)
కమిటీ సభ్యులు: అన్వర్ పాషా ,ఎం డి ఇర్ఫాన్ ,షఫీ అహ్మద్ పాషా,సయ్యద్ ఇంతియాజ్ ,ముక్తార్ అలీ , మొహిద్దీన్ , సయ్యద్ అలీం తదితరులు పాల్గొన్నారు

Leave a Reply