Kavitha | డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం

Kavitha | డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం
Kavitha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : డాడీ, మోడీ, చిన్నమోడీపైనే తన పోరాటం ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఉగాది వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన కొత్త పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతోందని అన్నారు.
బీఆర్ఎస్తో నా ఇష్యూను కాంగ్రెస్, సీఎం రేవంత్ (CM Revanth) అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. గాంధీజీ సర్వోదయ సిద్దాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నానని తెలిపారు. మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ (New party) ప్రకటిస్తానని పేర్కొన్నారు. పార్టీ ప్రారంభించగానే అజెండా, లక్ష్యాలను కూడా ప్రకటిస్తానన్నారు. పార్టీ ప్రారంభించినప్పుడే అజెండా, లక్ష్యాలు ప్రకటిస్తానన్నారు. కొత్త రాజకీయాలు చేస్తాం…సంకీర్ణ, రెయిన్బో రాజకీయాలు (Rainbow politics) అవసరమన్నారు.
భావసారూప్యత కలిగిన వారు, కలిసి వచ్చేవారితో కలిసి పోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్ (BRS)తో నా అంశాన్ని రేవంత్‌రెడ్డి రాజకీయంగా వాడుకుంటున్నారన్నారు. పార్టీ ప్రకటనకు ముందే జాతీయ నేతలను కలిసే అంశాన్ని ఆలోచిస్తున్నానన్నారు. పార్టీ కార్యాలయం కోసం అనువైన స్థలాన్ని అన్వేషిస్తున్నామన్నారు. అన్ని జిల్లాల్లో తమ పార్టీ ప్రభావం ఉంటుందన్నారు. యువత, మహిళలు, ఉద్యమంలో పనిచేసిన వారికి అవకాశం ఇస్తామని కవిత అన్నారు.
