Trump Failure Strategy : హోర్ముజ్ సంక్షోభం. Andhra Prabha Analysis

Trump Failure Strategy : హోర్ముజ్ సంక్షోభం. Andhra Prabha Analysis

అమెరికా ప్లాన్ ఫెయిల్ !?

  • ఇరాన్ చేతిలో హోర్ముజ్ చిలక
  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు
  • మిత్ర దేశాలు దూరం ఎందుకు?
  • సైనిక చర్య ఫలితం శూన్యం?..
  • విశ్లేషకుల హెచ్చరిక

( ఆంధ్రప్రభ, ఎనలిస్ట్​)

ప్ర‌పంచంలోనే కీల‌క చ‌మురు వార‌ధి హోర్ముజ్ జలసంధి ద్వారాలు తెర‌వట‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా .. అమెరికా త‌హ‌త‌హ‌లాడుతోంది. త‌న ఆయుధ సంప‌త్తితో ఇరాన్ ను నీరుగార్చి.. ప్ర‌పంచ దేశాల‌పై పెత్త‌నం సాగించే అవ‌కాశం కోసం అల్లాడిపోతోంది. చిట్టెలుక ఇరాన్ స‌సేమిరా అంటోంది. డ్రోన్ల‌తో గుల‌రాతి దెబ్బ‌లు కొట్టేస్తోంది. అంద‌రం జ‌ట్టు క‌డితే.. ఇరాన్ ఇచ్చే చుచ్చు పోతుంద‌ని మిత్ర దేశాల‌ను బ‌తిమిలాడిన‌, బామాలిన.. అమెరికాను ఏ ఒక్క దేశ‌మూ ప‌ట్టించుకోవ‌టం లేదు.నేరుగా ఇరాన్ తో బేరసారాలు చేసుకుని.. త‌మ నౌక‌ల‌ను ల‌సంధి దాటిస్తున్నాయి.

Trump Failure Strategy

ఈ స్థితిలోనే.. మిగిలిన దేశాల‌ను ఆక‌ట్టుకునేందుకు.. ఇరాన్ ను భ‌యంతో వ‌ణికించేందుకు బుధ‌వారం 50000 ఫౌండ్ల బ‌రువున బంక‌ర్ బ్లాస్ట‌ర్ బాంబుల‌తో హోర్ముజా జ‌ల‌సంధికి స‌మీపంలోని ఇరాన్ క్షిప‌ణి కేంద్రాల‌పై విరుచుకుప‌డింది. కానీ… ఇరానే కాదు.. ఏ ఓక్క దేశ‌మూ ఊ.. అన‌లేదు. ఉహూ అన‌లేదు. మ‌రో వైపు రిప‌బ్లిక‌న్ పార్టీ కీల‌క నేత‌.. అమెరికా నిఘా అధిప‌తి జో కెంట్ త‌న ప‌ద‌వి రాజీనామా చేయ‌టంతో,.. ఇంటా బ‌య‌టా ట్రంప్ ప‌ర‌వు గంగ‌లో క‌లిసినోయింది, ఇది స‌రే.. ఇంత‌కీ హోర్ముజ జ‌ల‌సంధి త‌లుపులు తెరుచుకుంటాయా? ప్ర‌పంచ ఆర్థిక సంక్షోభం వ్య‌థ తీరుతుందా? అమెరికా ప్ర‌యోగాలు ఫ‌లిస్తాయా? లేక విక‌టిస్తాయా? అస‌లు ఇరాన్ .. నిర్ణ‌యం ఏమిటీ? ఇక ప్ర‌పంచ దేశాల ఆలోచన ఏమిటీ? ఒక్క‌పారి ప‌రిశీలిద్దాం.

Trump Failure Strategy : ట్రంప్ కూట‌మి ఫెయిల్

Trump Failure Strategy

ఇరాన్ ను ఏకాకి చేసి.. హోర్ముజ జ‌ల‌సంధిని ఆధీనంలోకి తీసుకోవ‌టానికి నౌకాదళాల కూటమి నిర్మాణానికి అమెరికా అధ్చ‌క్షుడి ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఏకంగా కొన్ని దేశాలు నేరుగా ఇరాన్‌తో సురక్షిత మార్గం కోసం చర్చలు జరుపుతున్నాయి. ఇది ఒక కొత్త మ‌లుపుగా విశ్లేషకులు అభివ‌ర్ణిస్తున్నారు. సైనిక బ‌లంతో సంబంధం లేకుండా, ప్రపంచంలోనే అతి ముఖ్య ఇంధన జలమార్గాన్ని ఎవరు ఉపయోగించుకోవాలో అనే విష‌యంలో టెహ్రాన్ ఫ‌త్వా అమ‌ల‌వుతోంది.

Trump Failure Strategy

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఆప‌రేష‌న్ ఎథిక్ ప్యూరీలో ఇరాన్ సర్వోన్నత నేత అలీ ఖమేనీ మరణం తర్వాత, హోర్ముజ జ‌ల‌సంధిని ఆధీనంలోకి తీసుకుని ఇరాన్ ఇరాన్ తన అత్యంత శక్తివంత అస్త్రంగా ప్ర‌యోగించింది. ప్రపంచ ముడి చమురు మరియు సహజ వాయువు సరఫరాలలో 20 శాతం ప్రయాణించే హోర్ముజ్ జలసంధి ఉత్తర తీరం ఇరాన్​ నియంత్రణలో ఉంది. 33 కిలోమీటర్ల (20 మైళ్ల) వెడల్పుతో ఇది అత్యంత ఇరుకుగా ఉంటుంది, ఈ స్థితిలో ఈ మార్గాన్ని దాటాలనుకునే ఏ నౌకాదళమైనా ఇరాన్ ప్రధాన భూభాగం మీదుగా సాగాలి. లన భూభాగం నుంచి అత్యంత సులభంగా ఇరాన్​ లక్ష్యం చేసుకుని నౌకలను ముంచేయగలదు.

Trump Failure Strategy : బీమా కంపెనీల షాక్​

Trump Failure Strategy

ఈ జలసంధిలో నౌకలపై దాడులు సర్వసాధారణం. అప్పుడప్పుడూ వాతావరణ ముప్పు తప్పదు. ఇక యుద్ధవాతావరణం నెలొంటే.. పముద్ర రవాణా ఆగిపోవాల్సిందే. ప్రస్తుతం అదే జరిగింది. నష్టం భయంతో బీమా కంపెనీలు ప్రీమియంలను విపరీతంగా పెంచాయి. దీనికి తోడు ఈ 18 రోజుల్లో సుమారు 20 నౌకలపై దాడులు జరిగాయి. ఇక ఈ జలసంధి మీదుగా ప్రయాణించే నిబంధనలను తామే నిర్దేశిస్తామని ఇరాన్ నిరూపించుకుంది. ఈ కీలక చోక్‌ పాయింట్‌కు తామే ద్వారపాలకులమని తాజాగా ఇరానీలు చూపించారు. ఇలా గల్ఫ్ భౌగోళిక ప్రాంతంలో ఇరాన్ హోదా పెరిగిందని లండన్‌లోని సెక్యూరిటీ స్టడీస్‌లో కింగ్స్​ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ , కింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిడిల్ ఈస్టర్న్ స్టడీస్‌లో ఫెలో ఆండ్రియాస్ క్రీగ్ అన్నారు. సమీప భవిష్యత్తులో ఇదే కొత్త మలుపు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Trump Failure Strategy : ముడి చమురు సలసల

Trump Failure Strategy

ఈ యుద్ధం పుణ్యమా బ్యారెల్‌ ముడి చమురు ధర $100 దాటింది , ఇది యుద్ధానికి ముందున్న ధరల కంటే 20 శాతం అధికంగా పెరిగింది. దీంతో చరిత్రలోనే అతిపెద్ద అత్యవసర నిల్వలను ప్రపంచ దేశాలు విడుదల చేయక తప్పలేదు. గ్యాస్ ధరలు 40 శాతం పెరిగాయి. ఇంకేముందీ.. ప్రపంచం అకస్మాత్తుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ద్రవ్యోల్భణం ఉరుకులు పెడ్తోంది. నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. రవాణా సదుపాయాలు నీరసించాయి. బ్లాక్​ మార్కెట్​ జడలు విప్పింది. ఈ స్థితిలో దేశాలన్నీ ఇరాన్​ పక్షం చేరాయి.

Trump Failure Strategy : ఏకాకి పాత్రలో..

Trump Failure Strategy

ఈ జలమార్గం గుండా నౌకలకు రక్షణగా అమెరికా నౌకాదళాన్ని పంపాలనే అమెరికా అధ్యక్షుడు ప్రతిపాదించారు. కానీ ఇరాన్​ గులకరాళ్ దెబ్బతో మిత్ర దేశాల నౌకదళ కూటమికి రంగం సిద్ధం చేశారు. తమ యుద్ధ నౌకలను పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ జలసంధిని తెరవడంలో ఆ మిత్రదేశాలు సహాయం చేయక పోతే నాటో సభ్యులు “చాలా దారుణ భవిష్యత్తును ఎదుర్కొంటారని హెచ్చరించారు. కానీ ఆ విజ్ఞప్తిని ఆయా దేశాలు తిరస్కరించాయి. కొన్ని దేశాలు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. నౌకలను మోహరించే ప్రణాళికలు తమకు లేవని జపాన్ తేల్చి చెప్పింది. నౌకలను పంపించలేమని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. విస్తృత యుద్ధంలోకితమను లాగవద్దని యునైటెడ్ కింగ్‌డమ్ చెప్పింది. “ఇది మా యుద్ధం కాదు” అని జర్మనీ స్పష్టం చేసింది.
ఇది సరే.. అమెరికా పిలుపును పక్కన పెట్టిన కొన్ని దేశాలు నేరుగా ఇరాన్​ తో చర్చలు జరిపాయి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌ తో ఫోన్ లో మాట్లాడరు రోజులు తరబడి ఇండియా, ఇరాన్​ మధ్య చర్చల అనంతరం, శనివారం రెండు భారతీయ గ్యాస్ ట్యాంకర్లు జలసంధి గుండా ప్రయాణించాయి. పాకిస్తాన్, టర్కీ, చైనా నౌకలు కూడా హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాయి. ఇటలీ, ఫ్రాన్స్ కూడా ఒప్పందాల కోసం ఇరాన్‌ను సంప్రదించాయని ప్రచారం జరిగింది. అటువంటి ప్రతిపాదనను ఇటలీ అధికారులుతిరస్కరించారు. ఇక జలసంధిలో నౌకల రాకపోకలు సగటు కంటే 97 శాతం తక్కువగా ఉన్నప్పటికీ, ఇరాన్ ప్రాదేశిక జలాల గుండా ప్రయాణించే నౌకల సంఖ్య పెరుగుతోందని, “అనుమతి ఆధారిత రవాణా”ను ఇరాన్​ అనుమతిస్తోందని సముద్ర నిఘా పర్యవేక్షణ సంస్థ అయిన విండ్‌వార్డ్, మంగళవారంపేర్కొంది.

Trump Failure Strategy : ఇప్పుడు ఇరాన్​ ఇస్మార్ట్​..

Trump Failure Strategy

1980లలో ఇరాన్-ఇరాక్ యుద్ధం నాటికే, అమెరికా నౌకాదళం ఈ జలసంధి గుండా నౌకాదళాలకు రక్షణగా వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. కానీ నేటి పరిస్థితి భిన్నంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అప్పట్లో, అమెరికా ఇరాక్ నాయకుడు సద్దాం హుస్సేన్‌కు మద్దతు ఇస్తున్నప్పటికీ, ఆ ఘర్షణలో ప్రత్యక్షంగా పాలుపంచుకోలేదు. విప్లవానంతరం ఇరాన్ అధికారాన్ని పటిష్టం చేసుకునే ప్రక్రియలో ఉంది, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేటిలా వ్యవస్థీకృతంగా లేదు. ఇప్పటి పరిస్థితి వేరు. ఇరాన్ తన కర్మాగారాల్లో భారీ స్థాయిలో డ్రోన్‌లను తయారు చేస్తోంది. నిల్వలనూ పెంచింది. డ్రోన్ల వినియోగంలో ఆరి తేరింది. ఇరాన్ దళాలు చిన్న పడవలతో ట్యాంకర్లపై దాడి చేస్తున్నాయి. మందుపాతరలను అమర్చి, గెరిల్లా తరహా వ్యూహాలను అమలులో రాటుతేలింది. జలసంధిలో ఇరాన్ మందుపాతరలు అమర్చిందా లేదా అనే దానిపై పరస్పర విరుద్ధ నివేదికలు ఉన్నప్పటికీ, అలా చేయడం టెహ్రాన్‌కు ప్రతికూల చర్య అవుతుందని నిపుణులు చెబుతున్నాఉ. ఎందుకంటే, అది ఇరాన్ నౌకలతో సహా ఏ నౌకల రాకపోకలకైనా అంతరాయం కలిగిస్తుంది, ఎవరు వెళ్ళవచ్చో నిర్ణయించే అధికారాన్ని టెహ్రాన్ నుంచి దూరం చేస్తుంది. ఈ విషయంపై
తమ భౌగోళిక ప్రయోజనం గురించి ఇరాన్ అధికారులకు తెలుసు. “ఈ జలసంధిని ఎవరు ఉపయోగించుకోవాలో.. అనుమతించాల్సింది . మా సైన్యమే ” అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఆదివారం అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏకైక ముడి చమురు ఎగుమతి టెర్మినల్ ఫుజైరా ఓడరేవులో మంగళవారం ఒక డ్రోన్ దాడితో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం హోర్ముజ్ జలసంధి తూర్పు ప్రవేశ ద్వారం వెలుపల జరిగింది. ఈ దారిలోనే చమురు ఎగుమతులు ఆ జలసంధిని దాటి వెళ్ళడానికి వీలవుతుంది. యెమెన్‌లోని ఇరాన్ మద్దతుగల హౌతీలు బాబ్ అల్-మండేబ్ జలసంధికి అంతరాయం కలిగించడంతో చమురు ధరలను మరింతగా తగ్గించగలరు. అది అమెరికాను బహుళ సముద్ర మార్గాలలో కార్యకలాపాలు నిర్వహించేలా బలవంతం చేస్తుంది. ఇప్పటివరకు, హౌతీలు అటువంటి దాడులు చేయలేదు, కానీ ఈ నెలలో, తాము ఏ క్షణంలోనైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

Trump Failure Strategy : సైనిక చర్యతో ఫలితం శూన్యం

Trump Failure Strategy

నౌకల కూటమి ఆపరేషన్ తో హోర్ముజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‌పై ఒత్తిడి తీసుకువచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని క్రీగ్ అన్నారు. ఖార్గ్​ ద్వీపం జలసంధికి 500 కిలోమీటర్ల (310 మైళ్ల) దూరంలో ఉంది, ఒకవేళ అమెరికా దానిని స్వాధీనం చేసుకుంటే, అది యూఎస్ మెరైన్‌లను ఇరాన్ కాల్పులకు గురి చేస్తుంది. ఒకవేళ ఇరాన్ తన కీలక టెర్మినల్‌ను స్వాధీనం చేసుకుంటున్నట్లు గమనిస్తే, నేరుగా జలసంధిలో మైన్లను అమర్చడానికి కూడా వెనుకాడదు. హోర్ముజ్ జలసంధితో సమస్య నిజానికి సైనికపరమైనది కాదు. ఇది మార్కెట్‌ సమస్య, సైనిక చర్యతో విశ్వాసాన్ని పునరుద్ధరించలేం. దౌత్యం చర్చలతోనే విశ్వాసాన్ని పునరుద్ధరించగలం,” అని క్రీగ్ అన్నారు.

Trump Failure Strategy : అయినా.. అమెరికా సై..

Trump Failure Strategy

తమ ఆయుధ బలాన్ని ప్రదర్శించి ఇటు ఇరాన్​ కు అటు మిత్ర దేశాలకు , బలమైన హెచ్చరిక జారీ చేయటానికి అమెరికా దృష్టి సారించింది. ఇరాక్​ పై గరిష్ట ఒత్తిడి ప్రయోగించి, హోర్ముజ్ జలసంధిని తెరిపించాలని ఆమెరికా వ్యూహం, మధ్యప్రాచ్యంలోని కార్యకలాపాలకు బాధ్యత వహించే అమెరికా సైనిక పోరాట విభాగం యూఎస్ సెంట్రల్ కమాండ్, హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ తీరప్రాంతంలో ని నౌకా విధ్వంసక క్షిపణి స్థావరాలపై బుధవారం తెల్లవారుజామున 5,000 పౌండ్ల) బంకర్-బస్టింగ్ (బీ2బీ ఆయుధాలను ప్రయోగించింది. క్యూష్మ్ ద్వీపం (Qeshm Island)లోని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ఆధీనంలోని భూగర్భ యాంటీ – షిప్ క్షిపణి నిల్వలను GBU-72 బంకర్ బస్టర్లతో ధ్వంసం చేసింది.

Trump FailurTrump Failure Strategye Strategy

ఇరాన్ ప్రధాన నావికాదళ స్థావరం బందర్ అబ్బాస్ (Bandar Abbas) సమీపంలో పర్వతాల లోపల నిర్మించిన క్షిపణి ప్రయోగ కేంద్రాలను (Missile Silos), కోహ్‌స్టాక్ (Kohstak) భూగర్భ సొరంగాల్లో దాచిన మొబైల్ క్షిపణి లాంచర్లపై దాడులు జరిపినట్టు ప్రకటించింది.

Trump Failure Strategy

వేలాది మంది యూఎస్ మెరైన్‌లను తీసుకువెళ్లే ఉభయచర నౌకలను మధ్యప్రాచ్యానికి తరలించాలని ట్రంప్ ఆదేశించారు. ఇరాన్ ముడి చమురులో 90 శాతం ఎగుమతి అయ్యే ఉత్తర గల్ఫ్‌లోని ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నించవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఆ ద్వీపంలోని సైనిక స్థావరాలపై అమెరికా ఇప్పటికే వాటిపై బాంబు దాడి చేసింది. ఈ స్థితిలో.. అటు అమెరికా ఆధిపత్య ఆరాటం, ఇటు ఇరాన్​క ప్రతీకారం దీక్ష.. ఏ కీలక మలుపు తిప్పుతుందో.. వేచి చూడక తప్పదు.

ALSO READ : America Political Tornado జో కెంట్ రాజీనామా Andhra Prabha Detail Report