ముస్లిం మైనారిటీల సంక్షేమమే ధ్యేయం…

ముస్లిం మైనారిటీల సంక్షేమమే ధ్యేయం…

షాదీ ఖానాల అభివృద్ధికి కృషి చేస్తా
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇఫ్తార్ విందులో ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని)
ఇఫ్తార్ విందుకు హాజరైన వేలాది మంది ముస్లిం సోదరులు

చిట్టినగర్, ఆంధ్రప్రభ : ముస్లిం మైనారిటీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం, మైనారిటీల పక్షపాతి అని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని ) అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజక వర్గం చిట్టినగర్ ఈద్గా ప్రాంగణం లో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఇఫ్తార్ విందుకు ఎంపీ శివనాద్ తో పాటుగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగులమీరా, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు….. హాజరై ముస్లిం సోదరులతో కలిసి విందు స్వీకరించారు.

ముస్లిం సోదరులకు భోజనాన్ని స్వయంగా ఎంపీ శివనాధ్ వడ్డించారు… టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం డి ఫతావుల్ల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ….విజయవాడ నగర అభివృద్ధిలో ముస్లిం సోదరుల పాత్ర గొప్పదన్నారు. గడచిన ఎంపీ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ వచ్చిందంటే ముస్లిం సోదరుల అభిమానమే కారణమని ఎంపీ శివ నాథ్ అన్నారు. సుదీర్ఘకాలం నుంచి తమ కుటుంబం ముస్లిం కుటుంబాలతో కలిసి మెలసి ఉండే కుటుంబమన్నారు.

విజయవాడలో అన్ని కులాల వారు కలిసి మెలసి ఉండే సంస్కృతి ఉందని, ఇటువంటి సమైక్యంగా ఉన్న నగరం దేశంలో విజయవాడ మాత్రమే అన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలలోను ఇఫ్తార్ విందు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తిరువూరు లో ఇఫ్తార్ విందు ముస్లిం లకు ఇవ్వడం జరిగిందన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పటికీ రంజాన్ పర్వదినాలలో ఇఫ్తార్ విందులకు హాజరై ముస్లిం సోదరులతో గడపడం సంతోషంగా ఉందన్నారు. రంజాన్ మాసంలో…ప్రపంచ శాంతి కోసం అందరం కలిసి ప్రార్థిద్ధం అంటూ ఎంపీ పిలుపునిచ్చారు.

జగ్గయ్యపేట, తిరువూరు పశ్చిమ నియోజక వర్గంలో కుమ్మరిపాలెంలో షాది ఖానా,ఈద్గా గ్రౌండ్ , చిట్టినగర్లో మోథీ మసీదు షాధిఖానా, అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయింపులు త్వరలోనే జరిగేలా చూస్తానని, వచ్చేయడాది రంజాన్ నాటికి ఆయా షాదీ ఖానాలు అభివృద్ధి చెందెలా చూస్తా అన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జగ్గయ్య పేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ..టిడిపి కూటమి ప్రభుత్వం మైనార్టీ పక్షపాత ప్రభుత్వం అన్నారు.

ముస్లింల సంక్షేమం టిడిపి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తదితరులు మాట్లాడుతూ… విజయవాడ పార్లమెంట్ పరిధిలో ముస్లిం మైనారిటీలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించే నాయకుడు ఎంపీ కేశినేని శివనాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, మైనారిటీ యువ నాయకులు సాహుల్ ఖాన్, పశ్చిమ నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షుడు టి ఆన్సార్, ప్రధాన కార్యదర్శి సుభాని, ముస్లిం మైనారిటీ నాయకులు జాహిద్, అజ్జీజ్, అమానుల్లా, ఫైజాన్, అలీ, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply