ట్రిపుల్ ఐటి విద్యార్థిని మృతి.. తోటి విద్యార్థుల ఆందోళన

ట్రిపుల్ ఐటి విద్యార్థిని మృతి.. తోటి విద్యార్థుల ఆందోళన

బాసర, ఆంధ్రప్రభ : బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో పియుసి రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మల్లిపూడి తేజస్విని సోమవారం హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు టి ఏ ఎస్ ఏ యూనియన్ సభ్యులు తెలిపారు. క్యాంపస్ ఆసుపత్రిలో లుకేమియా వంటి ప్రాణాంతక వ్యాధిని గుర్తించడానికి సరైన పరికరాలు లేవు ఈ ఘటన తీవ్రమైన ఆందోళను కల్గిస్తుందని విద్యార్థి సంఘం సభ్యులు ఆరోపించారు.

మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ఏభై లక్షల రూపాయల పరిహారం, క్యాంపస్‌లోని ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్ పరికరాల తక్షణ అప్‌గ్రేడ్ చేయాలని,ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా యూనివర్సిటీ అధికారులు స్పందించాలని టి.ఎస్.ఏ.ఎస్ సంఘం డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించింది.

Leave a Reply