దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దివ్యాంగ శక్తి కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్ లో బుధవారం దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రత్యేక అధికారి పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల ప్రయాణాన్ని సులభరతం చేస్తూ, వారిలో ఆత్మవిశ్వాసం నింపడమే దివ్యాంగ శక్తి లక్ష్యం అని తెలిపారు. 2016 ప్రకారం 21 రకాల దివ్యాంగులలో 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత్వం, ఉన్నవారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.
ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించడంతో, దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ డిపో మేనేజర్ హంపన్న, ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయ భాస్కర్, పెన్నాహోబిలం ఆలయ చైర్మన్ రాయంపల్లి నాగరాజు, టీడీపీ నాయకులు మోపిడి గోవిందు, ఇంద్రావతి వెంకటేశులు, సుధాకర్, తిమ్మప్ప, రామాంజనేయులు, వరప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
