April 1st | ఆ తర్వాత బర్త్ డే సర్టిఫికెట్ సమర్పించాల్సిందే..

April 1st | ఆ తర్వాత బర్త్ డే సర్టిఫికెట్ సమర్పించాల్సిందే..
April 1st | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పాన్ కార్డు దరఖాస్తు నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి కఠినతరం కానున్నాయి. ఆధార్‌తో పాన్ దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31 వరకే గడువు ఉంది. ఏప్రిల్ 1 నుంచి పాన్ పొందాలంటే ఆధార్‌తో పాటు పుట్టిన తేదీని ధ్రువీకరించే పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలతో దరఖాస్తు ఫారాలు కూడా మారనున్నాయని కామన్ సర్వీస్ సెంటర్ సూచించింది.
బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలకు కీలకమైన పాన్ ను పొందాలంటే ఏప్రిల్ 1 నుంచి ఆధార్ తో పాటు అదనపు డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే ఏప్రిల్ 1నుంచి బర్త్ డే సర్టిఫికెట్ అవసరం కానున్నాయి. బర్త్ సర్టిఫికెట్, ఓటర్ ఐడీ కార్డు, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, అఫిడవిట్, పాస్ట్ పోర్ట్ వంటి పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాక దరఖాస్తు ఫారాలు కూడా మారనున్నాయని కామన్ సర్వీస్ సెంటర్ పేర్కొంది. ఆన్ లైన్ లో కొత్త పాన్ కార్డు కోసం Protean, UTITSL వెబ్ సైట్లను సందర్శించాలని సూచించింది.
