E-mail | బాంబ్-డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు

E-mail | బాంబ్-డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు

Gujarat | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : గుజరాత్ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. అయితే గుజరాత్ అసెంబ్లీకి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. దుండగులు భవనాన్ని పేల్చివేస్తామని బెదిరించడంతో ప్రజాప్రతినిధులను బయటికి పంపించి, బాంబ్-డాగ్ స్క్వాడ్‌లతో గాలింపు చేపట్టారు. ఫిబ్రవరి 16న ప్రారంభమైన ఈ సమావేశాలు మార్చి 25 వరకు కొనసాగనున్నాయి.

స‌మావేశాలు ప్రారంభం కావ‌డానికి ముందే ఈ మెయిల్ వ‌చ్చిన‌ట్లు తెలిసింది. అంసెబ్లీ కాంప్లెక్స్‌లో బాంబును అమ‌ర్చిన‌ట్లు బెదిరింపులో పేర్కొన్నారు. దీంతో అసెంబ్లీ లో ఉన్న సిబ్బంది, ఎమ్మెల్యేల‌ను ప‌రిస‌ర ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. డిప్యూటీ ఎస్పీ పీయూష్ వందా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి అనుమానిత వస్తువును గుర్తించ‌లేదన్నారు.

Leave a Reply