Ustad Bhagat Singh | గెట్ రెడీ.. ఫ్యాన్స్

Ustad Bhagat Singh | గెట్ రెడీ.. ఫ్యాన్స్
పవన్ అభిమానులకు గుడ్‌న్యూస్
మార్చి 15న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్
హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5గంటలకు..
అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీశ్-పవన్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక తేదీ ఖరారైంది. మార్చి 15న హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5గంటలకు ఈవెంట్ నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అలాగే చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ఈ విషయాన్ని పవన్ అభిమానులతో పంచుకున్నారు. ‘ఈసారి ఈవెంట్ బద్దలైపోవాలి ఫ్రెండ్స్’ అని పేర్కొన్నారు. ఇక శనివారం సాయంత్రం ‘ఉస్తాద్’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. రాశీఖన్నా, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్న ఈ మూవీ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
