నాణ్యమైన భోజనాని అందించాలి..

నాణ్యమైన భోజనాని అందించాలి..
రాచూర్ సర్పంచ్ గున్నేళ్ల శ్రీనివాస్….
వెల్దండ, ఆంధ్రప్రభ : విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సర్పంచ్ గున్నేళ్ళ శ్రీనివాసులు ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా వెల్దండ మండల పరిధిలోని రాచూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలని సోమవారం వారు సందర్శించి విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఫోన్లకు ఆకర్షితులు కాకుండా చదువుపై దృష్టి సారించి పాఠశాలకు మీ యొక్క తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు సాధించి పెట్టాలని విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులకు విద్యాపరంగా ఎలాంటి ఆర్థిక పరమైన సహాయ సహకారాలను అందించడానికి నేను ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
