ప్రభ న్యూస్ ప్రతినిధి, మేడ్చల్ మార్చి 18 : మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లోని మినీ హాల్ లో నిర్వహించిన ఎస్సీ కమిషన్ మీటింగ్ కు జిల్లా కలెక్టర్ ప్రెస్ కు అనుమతి ఇవ్వలేదు. ఈ మీటింగ్ కు హాజరైన మీడియా ప్రతినిధులకు జిల్లా ఇంచార్జీ సమాచార శాఖ అధికారిని స్వర్ణలత ఈ మీటింగ్ కు ప్రెస్ కు అనుమతి లేదని తెలిపారు.
కేవలం పిటిషన్లు తీసుకునే మీటింగ్ కు మాత్రమే అనుమతి ఉందని చెప్పారు. కాగా ఈ మీటింగ్ కు హాజరైన ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ కు పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు మేడ్చల్ డి.సి.పి కోటిరెడ్డి.