గ్రామ అభివృద్ధికి సహకరించాలి..

గ్రామ అభివృద్ధికి సహకరించాలి..

రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ ను కలిసిన సర్పంచ్ ధనలక్ష్మి వెంకట్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామ అభివృద్ధి కోసం సహకరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం గ్రామ సర్పంచ్ ఎన్నపల్లి ధనలక్ష్మి వెంకట్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల కార్యదర్శి కె. సురేందర్ మోహన్ (ఐఏఎస్) ను ఆరెగూడెం గ్రామ సర్పంచ్ ఎన్నపల్లి ధనలక్ష్మి వెంకట్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే ను అందజేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ కు వివరించి గ్రామ అభివృద్ధి కోసం, గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దడానికి అవసరమైన సహకారం అందించాలని సర్పంచ్ కోరారు.

Leave a Reply