అక్రమంగా ఇసుక తరలింపు

అక్రమంగా ఇసుక తరలింపు
ఇసుక కంటైనర్ స్వాధీనం,ఇద్దరిపై కేసు నమోదు
బాల్కొండ,ఆంధ్రప్రభః ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న కంటైనర్ ను నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీసులు బుధవారం అర్ధరాత్రి పట్టుకున్నట్లు ఎస్సై శైలేందర్ గురువారం తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం బుధవారం అర్ధరాత్రి తమ పోలీసులు సిబ్బంది పెట్రోల్ నిర్వహిస్తున్న సమయంలో జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం నుండి బాల్కొండ మండలం చిట్టాపూర్ కు వస్తున్న క్రమంలో జాతీయ రహదారి 44 పై టీఎస్ 16 యుబి 7717 అనే కంటైనర్ అతివేగంతో వెళ్లడంతో తమ సిబ్బంది గమనించి, కంటైనర్ ని ఆపి తనిఖీ చేయగా ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు.
లారీ డ్రైవర్ రజినీకాంత్ ను అదుపులోకి తీసుకొని ఇసుకతో పాటు కంటైనర్ ను బాల్కొండ పోలీస్ స్టేషన్ తరలించి కంటైనర్ యజమాని రమేష్, డ్రైవర్ రజినీకాంత్ పై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
