పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్

పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్

మోత్కూర్, ఆంధ్రప్రభః మున్సిపల్ కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ తీరును బుధవారం మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న లు మార్నింగ్ వాక్ లో భాగంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోతాయిగడ్డ లో పెట్రోల్ బంక్ లో వినియోగదారుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన మూత్రశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ,మెరుగు పరచాలని బంక్ యజమాని కి సూచించారు. మెయిన్ రోడ్డు వెంట,ఆయా గల్లీలలో డ్రైనేజీలను పరిశీలించారు. పారిశుద్ధ్య వాహనంలో చెత్త తరలింపు,కాశవారి గూడెం లో పబ్లిక్ నల్లాల వద్ద వాటర్ లీకేజీని పరిశీలించారు. తక్షణమే లీకేజీని గుర్తించి మరమ్మతులు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Leave a Reply