బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తహసీల్దార్ సమీక్ష

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తహసీల్దార్ సమీక్ష

గంపలగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మండలంలోని నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఈ నెల 28వ తేదీ నుండి మార్చి 05వ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలపై బుధవారం తహసీల్దార్ వి.రాజాకుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఏర్పాట్లపై చర్చించారు. స్వామి వారి బ్రహ్మోత్సవములకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమములో దేవాలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణధికారి నేల సంధ్య, మండల అభివృద్ధి అధికారిణి టి.సరస్వతి,గ్రామ సర్పంచ్ దుబ్బాకుల రామకృష్ణ, ఎంపిటిసి కుంభగిరి వెంకటకృష్ణ, ఆలయ మాజీ అధ్యక్షులు బెల్లం మధుసూదన్ రావు, వడ్లమూడి రాజశేఖర్, మాజీ సభ్యుడు వనమా చిన్న అనంతరామయ్య, బెల్లం రామారావు, కుంభగిరి సురేష్, ఎమ్.జమలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply