City| అక్కడక్కడ చిరు జల్లులు

City| అక్కడక్కడ చిరు జల్లులు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఫిబ్రవరి నెల ఆరంభం నుంచే ఎండలు ముదిరాయి. వేడి వాతావరణం కారణంగా ఉక్కపోతకు జనం అల్లాడిపోయారు. ఇవాళ భాగ్యనగరంలో వెదర్ చాలా కూల్‌గా మారింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండగా ఉంది. ఒంటి గంట తరువాత ఆకాశం మేఘావృతమైంది. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.
నగరంలోని ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్టిసి క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో చిరు జల్లులు పడగా, కొన్ని చోట్ల ఈదురుగాలులు కూడా వీచాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఉత్తర, మధ్య తెలంగాణల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉంది. రాగల 3 గంటల్లో హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
