Student | ఎక్కడంటే…

Student | ఎక్కడంటే…
Student | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట ఓ ప్రైవేట్ హాస్టల్లో ఎం బి యు ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. మోహన్ బాబు యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నభువవ (22)గా గుర్తించారు.
ఎంబీయూలో జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం స్పందించాలంటూ విద్యార్థి సంఘాలు నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని చంద్రగిరి సీఐ సురేష్ కుమార్ తెలిపారు. మృతురాలు పుంగనూరు నియోజకవర్గంలోని మంగళంకు చెందిన విద్యార్థి అని పోలీసులు తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు సంబందించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

