108 ఉత్తమ ఉద్యోగులకు పీఓ సన్మానం.. ప్రశంస

108 ఉత్తమ ఉద్యోగులకు పీఓ సన్మానం.. ప్రశంస

ఉట్నూర్ రూరల్, ఆంధ్రప్రభ : ఏజెన్సీగిరిజన ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీల తరలింపు , హాస్పిటల్కు తీసుకెళ్లడం డాక్టర్ పరిశీలన అనంతరం ఇంటి వద్ద క్షేమంగా వదిలేయడం వెహికల్ మెయింటెనెన్స్ మరియు రికార్డ్స్ మెంటేనెస్ విభాగంలో గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి 102 కెప్టెన్ హరి ఓం , దల్లు సింగ్ లకు ఉత్తమ ఉద్యోగులుగా పురస్కార అవార్డు రావడంతో వారికి సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ యువరాజ్ సన్మానించి, ఉత్తమ పురస్కార అవార్డుల పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ 108 102 ఉద్యోగులు ఏజెన్సీ ప్రాంతంలో ఇలాగే ఉత్తమ సేవలందించి ప్రజల అధికారుల మన్ననలు పొందాలని ఆయన కోరారు. సందర్భంగా జిల్లా మేనేజర్ సామ్రాట్, జిల్లా ఇంచార్జ్ శేఖర్ రెడ్డి, 102 ప్రాజెక్టు ఇంచార్జ్ మనోహర్ పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా మేనేజర్ సామ్రాట్ మాట్లాడుతూ అంకితభావంతో పనిచేస్తే గుర్తింపుతో పాటు ప్రజల ఆశీస్సులు ఉంటాయని అవార్డు గ్రహీతలను అభినందించారు.

Leave a Reply