WGL | బకాయి కట్టలేదని బ్యాంకు వేధింపులు..

  • రుణం కట్టకపోతే భూమిని వేలం వేస్తామని రైతుకు నోటీసులు
  • నీరు లేకనే పంటలు ఎండుతుంటే రుణం ఎట్లా కడతామంటున్న రైతు

(నర్సింహులపేట, డోర్నకల్ నియోజకవర్గం) (ఆంధ్రప్రభ) : తీసుకున్న పంట రుణం కట్టకపోతే భూమిని వేలం వేస్తామని బ్యాంకు అధికారులు పదేపదే వేధిస్తున్నారని బ్యాంకు అధికారులు పంపించిన నోటీసులతో పంట పొలంలో నిరసన తెలిపిన తన ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో చోటుచేసుకుంది.బాధితుడు మందుల యాకుబ్ తెలిపిన వివరాల ప్రకారం..

మరిపెడలోని డిసిసిబి బ్యాంకులో మార్టు గేజ్ లోను కింద తన వ్యవసాయ భూమిని తనఖా పెట్టి రూ.5లక్షలు తీసుకోగా 2023 లో రెండు లక్షలు చెల్లించాడు.మళ్ళీ 2024లో రూ.3లక్షలు చెల్లించాడు.ఇప్పుడు మళ్ళీ రూ.2.90వేలు బకాయి ఉన్నావని తీసుకున్న రుణం చెల్లించాలని చెల్లించకపోతే భూమిని వేలం వేస్తామని నోటీసులు పంపినట్లు తెలిపారు.

అదే డీసీసీబీ బ్యాంకులో క్రాప్ లోను కూడా తీసుకున్నానని ప్రభుత్వం మాఫీ చేసిన క్రాఫ్ లోన్ జాబితాలో పేరు రాలేదని ఇప్పటివరకు రుణమాఫీ కాలేదని ఎందుకు రాలేదని ప్రశ్నించడంతో సంబంధిత బ్యాంకు అధికారులు బ్యాంకులో అప్పుందని తీర్చకుంటే భూమిని వేలం వేస్తామని నోటీసులు పంపించారని ఆవేదన వ్యక్తం చేస్తూ పంట పొలంలో తన ఆవేదన వ్యక్తం చేశారు.

నర్సింహులపేట మండలంలో దాదాపు ఇప్పటి వరకు 20 మంది రైతులకు బ్యాంకు అధికారులు నోటీసులు ఇదే మాదిరిగా పంపారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *