చిన్నారి మృతదేహంతో రాస్తారోకో..

చిన్నారి మృతదేహంతో రాస్తారోకో..

రెండు నెలల పసికందు మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
ఆసుపత్రి ముందు రాస్తారోకో, పోలీసులతో వాగ్వాదం

నాగర్ కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రభః నాగర్ కర్నూల్ మండలం కుమ్మర గ్రామానికి చెందిన గణేష్ కూతురైన రెండు నెలాల చిన్నారిని చంపిన సంఘటనను నిరసిస్తూ జిల్లా ఆసుపత్రి ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జేఏసీ ఆధ్వర్యంలోకుటుంబ సభ్యులు పసికందు మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలన్నీ ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. దాదాపుగా ఏడున్నర నుండి ఆందోళన చెపట్టారు. ఈ రాస్తారోకోలో ధర్మసమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు విషారదన్ మహరాజ్, బిడిఎస్పి పార్టీ అధ్యక్షులు బోనాసి రామచందర్, బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్ గౌడ్, లక్సమాన్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

అగ్రకులస్తులైన దురాహంకారంతో జాతర సంఘటనలో మహిళలను కొట్టి చిన్నారిని చంపేసి తీవ్రమైన దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారని విషారదన్ ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన సర్పంచి తుకారాం రెడ్డి, సతీష్ రెడ్డి ,శ్రీనివాసరెడ్డి, మధు రెడ్డిలపై హత్య నేరం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అగ్రకులస్తులైన ముఖ్యమంత్రి అండ చూసుకొని దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. డి.ఎస్.పి శ్రీనివాస్, ఎస్ఐ గోవర్ధన్ లు వారిని సర్ది చెప్పి రాస్తారోకో విరమించడానికి ప్రయత్నించిన విరమించకపోగా విశారదన్ డిఎస్పితో వాగ్విదాం చేశారు. పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఈ ఘటనలో పూర్తిగా విఫలమయ్యారని వారిని అరెస్టు చేసేంతవరకు విరమించేది లేదని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని విశారదన్ డిమాండ్ చేశారు

Leave a Reply