ధ్రువపత్రాల అందజేత…

కుంటాల, ఆంధ్రప్రభ ; ఫిబ్రవరి గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యుల పాత్ర కీలకమని వార్డు సభ్యులు ప్రణాళిక బద్ధంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. శనివారం కుంటాల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు నిర్వహించిన ముగింపు శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ వార్డు సభ్యులు గ్రామ పంచాయతీలకు ప్రజలకువారధిగా పని చేయాలన్నారు.

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కీలకపాత్ర వహిస్తే లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందన్నారు. వార్డు సభ్యులు తమ వార్డు పరిధిలో రోడ్లు డ్రైనేజీలు విధి దీపాలు తాగునీటి వసతి కల్పించేందుకు వేక్షించాలన్నారు. వార్డు సభ్యులకు సమస్యలను అవసరాలను గ్రామసభలు పంచాయతీ సమావేశం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో ప్రధాన సమస్యలు గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేసి పనులు చేపట్టేందుకు తీర్మానించాలన్నారు.

వార్డు సభ్యులు సమస్యల పరిష్కారంతోపాటు పన్నుల వసూలు గ్రామపంచాయతీలకు వచ్చే ఆదాయ వనరుల వసూళ్లకు సహకరించాలన్నారు.ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధికి నాంది పథకాలఅన్నారు. అనంతరం శిక్షణ పొందిన వార్డుసభ్యులకు ధ్రువపత్రాలుపంపిణీ చేశారు. ఐదు రోజులపాటుటి ఓ టి లు సతీష్ కుమార్ గోపీనాథ్ రాజన్న శ్రీహరి లు వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అల్లాడి వనజ ఎంపీ ఓ ఎం ఏ అబ్దుల్ రహీం ఏపీఓ నవీన్ పంచాయతీ కార్యదర్శులు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply