7,408 homes | మున్సిపల్ పాలకవర్గానికి పెద్ద సవాల్…!

7,408 homes | మున్సిపల్ పాలకవర్గానికి పెద్ద సవాల్…!

  • ఏడాది గడిచినా 18వార్డుల్లో సమస్యలు యథాతథం
  • డ్రెయినేజీలు మూసుకుపోయి రోడ్లపై మురుగునీరు
  • పారిశుద్ధ్య సిబ్బంది కొరతతో చెత్త కుప్పల మధ్య జీవనం
  • వర్షంలో బురద, ఎండలో దుమ్ముతో ప్రజల నిత్య ఇబ్బందులు
  • ప్రత్యేక మార్కెట్ లేక రోడ్లపైనే వ్యాపారం…ట్రాఫిక్‌కు అడ్డంకులు
  • చెత్త పేరుకుపోవడంతో మరింత తీవ్రంగా ట్రాఫిక్ సమస్యలు
  • మురుగునీటి నిల్వలతో సీజనల్ వ్యాధుల ముప్పు పెరుగుతోంది
  • రేపు బాధ్యతలు స్వీకరించే కొత్త పాలకవర్గానికి ఇదే భారీ సవాల్
  • ప్రజల చూపు అంతా నూతన మున్సిపల్ పాలకవర్గంపైనే…
  • పరిష్కారం ఎప్పుడు? అని ఎదురు చూడాల్సి ఉంది..!

7,408 homes | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ నూతనంగా మున్సిపాలిటీగా ఏర్పడి ఏడాది పూర్త యింది. అయినప్పటికీ మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు రోజు రోజు కు మరింత ముదురుతున్నాయి. ఏడాది గడిచినా 18 వార్డుల్లో మౌలిక వసతుల లోపాలు యథాతథంగానే కొనసాగుతున్నాయి. నేడు (శుక్రవారం) నూతన మున్సిపల్ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించను న్న నేపథ్యంలో పట్టణ ప్రజలు సమస్యల పరిష్కారంపై ఆశలు పెట్టుకున్నారు.

48.24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ మున్సిపాలిటీ పరిధిలో స్టేషన్ ఘన్‌పూర్, చాగల్లు, శివునిపల్లి గ్రామాలు కలిపి మొత్తం 18వార్డులు ఉన్నాయి. జనాభా 30,527 కాగా, 7,408 గృహాలు ఉన్నాయి. పట్టణంలో 25.56 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 17.08 కిలోమీటర్ల డ్రెయినేజీలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

7,408 homes |
  • ప్రతి వార్డులో పారిశుద్ధ్య సమస్యే :

పారిశుద్ధ్య సమస్య ప్రధానంగా ప్రతి వార్డులో తలెత్తుతోంది. ప్రత్యేక సిబ్బంది నియామకం జరగకపోవడంతో గతంలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో డ్రెయినేజీలు తరచూ మూసుకుపోయి మురుగునీరు రోడ్లపైకి పారుతోంది. దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది కొరతతో చెత్త కుప్పల మధ్య ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇంకా పలు కాలనీలు సీసీ రోడ్లకు నోచుకోక మట్టిరోడ్లకే పరిమితమయ్యాయి.

7,408 homes |

వర్షాకాలంలో బురద, ఎండాకాలంలో దుమ్ము ప్రజలకు నిత్య ఇబ్బంది గా మారింది. ప్రత్యేక మార్కెట్ సదుపాయం లేకపోవడంతో రోడ్లపైనే వ్యాపారం సాగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రమవు తున్నాయి. చెత్త పేరుకుపోవడం, మురుగునీటి నిల్వలు సీజనల్ వ్యాధులకు దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రోడ్లపై చెత్తను సకాలంలో తొలగించకపోవడంతో కాలనీలు అస్తవ్యస్తంగా కనిపిస్తున్నా యి. మురుగునీరు నిల్వ ఉండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

7,408 homes |
  • పట్టణ ప్రజల చూపు మొత్తం నూతన పాలకవర్గంపైనే

ప్రతి వార్డులో డ్రెయినేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం, మార్కెట్ వ్యవస్థీకరణ వంటి అంశాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతు న్నారు. మున్సిపాలిటీగా మారిన తర్వాత అభివృద్ధి ఆశించాం. కానీ సమస్యలు అలాగే ఉన్నాయని స్థానికులు పేర్కొన్నారు. కొత్త పాలక వర్గం వెంటనే చర్యలు తీసుకుని పట్టణాన్ని అభివృద్ధి దిశగా నడిపిం చాలని వారు కోరుతున్నారు.

7,408 homes |

దీంతో రేపు(శుక్రవారం)బాధ్యతలు స్వీక రించనున్న కొత్త మున్సిపల్ పాలకవర్గానికి ఇదే అతిపెద్ద సవాల్‌గా మారింది. ప్రస్తు తం పట్టణ ప్రజల చూపు మొత్తం నూతన పాలకవర్గం పైనే నిలిచింది. సమస్యలకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో అన్న ఆతృతతో పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

7,408 homes |

Leave a Reply