YouTube | లక్షలాది మంది యూజర్ల ఫిర్యాదు..

YouTube | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. మొబైల్, డెస్క్ టాప్ లో యూట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదని యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. యాక్సెస్ చేయాలని చూస్తుండగా ‘Something went wrong’ అని చూపిస్తోందని చెబుతున్నారు. కాగా ఇవాళ ఉదయం 6.18గంటల నుంచి 7.33గంటల మధ్య యూట్యూబ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది.

కొందరికి YouTube సేవలు అందుతుండగా మరికొందరు ఫోన్ లేదా వెబ్‌సైట్‌లో యాక్సెస్ చేయలేకపోతున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ డౌన్ అయినట్లు ఆ సంస్థ ధ్రువీకరించింది. స్ట్రీమింగ్ లో కొన్ని సమస్యలు ఎదురవుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. సమస్య పరిష్కరించడం కోసం తమ టెక్ టీమ్‌లు పనిచేస్తున్నాయని పేర్కొంది.

Leave a Reply