Tuberculosis | చౌడవరంలో క్షయ నిర్ధారణా పరీక్షలు

Tuberculosis | చౌడవరంలో క్షయ నిర్ధారణా పరీక్షలు

Tuberculosis | వేంసూరు,ఆంధ్రప్రభ: సంపూర్ణ క్షయ వ్యాధి నిర్ధారణా కార్యక్రమంలో భాగంగా చౌడవరం ఆరోగ్య ఉప కేంద్రంలో క్షయ వ్యాధి నిర్ధారణా పరీక్షలు నిర్వహించారు. మొబైల్ వ్యాన్ ద్వారా వైద్య పరికరాలను తీసుకొచ్చి ఎక్స్ రే పరీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని నలుగురు సర్పంచులు నల్లిబోయిన అంజమ్మ చిన్నికృష్ణ, పొట్లపూల శ్రీదేవి భాను, భర్మావత్ రాము, చిలకా వసంతం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ 2035 సంవత్సరం నాటికి క్షయ రహిత దేశంగా మార్పు చేపట్టే పనిలో భాగంగా తెమడు పరీక్షలు, మొబైల్ ఎక్స్ రే ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మండలంలో క్షయ వ్యాధి అనుమానితులను గుర్తించి, వారికి ఇప్పటికే తెమడ పరీక్షలు చేశామన్నారు.165 మందికి తెమడ పరీక్షలు చేపట్టగా, 16 మందికి మందులు అందిస్తున్నట్లు తెలిపారు. వ్యాధిగ్రస్తులకు ప్రతినెల 500 రూపాయలు పౌష్టికాహారం కొరకు ఇస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షల కోసం వచ్చే వారికి రవాణా ఖర్చులు కూడా ఇస్తున్నట్లు వివరించారు. తెమడ పరీక్ష అత్యధికంగా, చోడవరం ఆరోగ్య ఉప కేంద్రం పరిధి లోని చౌడవరం, పల్లెవాడ, రాజు గూడెం, చౌడవరం తండా, ఎర్రగుంటపాడు గ్రామాల పరిధిలో చేయటం జరిగిందన్నారు. వయా గ్రామాల పరిధిలో 64 మందికి తెమడ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

వ్యాధి నిర్ధారణ కోసం ఎక్సరే పరీక్షలను చేస్తున్నట్లు తెలిపారు. 14 రోజులకు పైగా జ్వరం తీవ్రత, దగ్గు, బరువు తగ్గటం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట చమటలు పట్టడం వంటి లక్షణాలు కలిగిన వారిని అనుమానితులుగా గుర్తించి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఆరు నెలల వ్యవధిలో తగ్గిపోయే క్షయ వ్యాధికి ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదన్నారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే ఆశా కార్యకర్తల వద్ద తెమడ పరీక్షలు చేయించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గొర్ల సత్యనారాయణరెడ్డి, సిహెచ్ఓ వెంకట నారాయణ, సూపర్ వైజర్లు శ్రీనివాసరావు, పద్మ, ప్రధానోపాధ్యాయులు నాగాంజనేయులు, ఉపాధ్యాయులు అహ్మద్, ఎంఎల్ హెచ్ పి ఉదయ్ కిరణ్, ఏఎన్ఎం రమాదేవి, టీబి అలర్ట్ ఇండియా డీపీఏం వెంకట్, డిసిపి ప్రభాకర్, టెక్నీషియన్ కనకారావు, ఆశా వర్కర్లు మంగ, లక్ష్మి, కృష్ణవేణి, రాజ్యం, మాధవి, రాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply