Bill Gates In AP : అమరావతిలో.. బిల్ గేట్స్ Andhra Prabha Spot News

Bill Gates In AP : అమరావతిలో.. బిల్ గేట్స్ Andhra Prabha Spot News
ఏపీ సీఎం ఘన స్వాగతం
డిప్యూటీ సీఎం.. సహా మంత్రులు హాజరు
( ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి )
ఆంధ్రావని ప్రజా రాజధాని అమరావతిలో హైటెక్ విప్లవ క్రతువు ఆరంభమైంది. క్వాంటం వ్యాలీ యజ్ఞానికి ఆత్మీయ అతిథిగా మైక్రోసాప్ అధినేత బిల్ గేట్ తెలుగింటి క్రతువుకు వచ్చారు. ఏపీ సచివాలయానికి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఉదమం 10 గంటలకు చేరుకున్నారు. గే ట్స్ బృందానికి మొదటి బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు స్వాగతం పలికారు. బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు తన మంత్రులను పరిచయం చేశారు. యజ్ఞ యజమాని, ప్రధాన ఋత్వికుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అతిథిదేవోభవ అంటూ ఆహ్వానించారు. ఇక యజ్ఞ మైత్రావరుణుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, క్రతువు అచ్ఛావాకుడు ఐటీ మంత్రి నారా లోకేష్ .. కీలక పాత్ర పోషిస్తున్నారు. అతిథి బిల్ గేట్స్ ను ప్రసన్నం చేస్తున్నారు.
Bill Gates In AP























