Shivaratri | ఘనంగా శివాలయాల్లో ..మహా శివరాత్రి వేడుకలు

Shivaratri | ఘనంగా శివాలయాల్లో ..మహా శివరాత్రి వేడుకలు
Shivaratri | చిట్యాల, ఆంధ్రప్రభ: మండలంలోని శివాలయాల్లో ఆదివారం మహాశివరాత్రి వేడుకలు ప్రజలు పూజ కార్యక్రమలో పాల్గొని ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని ఒడితల చల్లగరిగ, జూకల్, నవాబుపేట, తదితర గ్రామంలోని దేవాలయాల్లో ప్రజలు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని ఒడిదల శివాలయంలో చిట్యాల ఎస్సై జి శ్రావణ్ కుమార్, పోలీస్ సిబ్బంది, శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి భగవాన్, ఆలయ కమిటీ చైర్మన్ కత్తి సతీష్, ఏఎస్ఐ సమ్మిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ యాక య్య ,కానిస్టేబుల్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
