temple | ఓం నమః శివాయ అంటూ…

temple | ఓం నమః శివాయ అంటూ…
- కలియుగ కైలాసానికి పోటెత్తిన భక్తజనం
temple | అమరావతి (పల్నాడు జిల్లా), ఆంధ్రప్రభ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కలియుగ కైలాసంగా పేరు గాంచిన అమరావతి క్షేత్రం ఆదివారం శివనామస్మరణతో మారుమోగింది. తెల్లవారుజాముకే రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు పరమపావని కృష్ణానదీ తీరంలో ఏర్పాటు చేసిన జల్లుస్నానాలు ఆచరించి దైవ దర్శనం కోసం క్యూలైన్లలో వేచిఉన్నారు.
తెల్లవారుజాము ఆలయంలోని మూలవిరాట్ కు అనువంశికధర్మకర్తల పేర్ల ఆలయ ప్రధాన అర్చకులు కైతేపల్లి సుధీర్ శర్మ పర్యవేక్షణలోఆర్చక బృందం, వేద పండితులుఅభిషేకాలు, పూజలునిర్వహించిన పిమ్మట3గంటలకు స్వామివారిఆలయ కైలాసద్వారం తెరచి భక్తులకు స్వామివారి దర్శనం, అభిషేకాలను ప్రారంభించారు.

వేలాదిగా వచ్చిన భక్తులు 300రూపాయాల అభిషేకాలు, ప్రత్యేక దర్శనం, ఉచితదర్శనం లైన్లద్వారాఆలయంలోనికిప్రవేశించి అమరేశ్వరునికిఅభిషేకాలు, బాలాముండికా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి కానుకలు,మొక్కుబడులు సమర్పించారు. ఉదయం 9గంటల వరకు భక్తులు తక్కువగా ఉన్నప్పటికీ క్రమేపీ పెరిగి రాత్రి వరకురద్దీసాగింది.భక్తులు ఓంనమశివాయా, ఓంనమశివాయా: అంటూ దిక్కులు పిక్కటిల్లేల్లా స్వామి స్మరణ చేయటంతో క్షిణకాశిగా పేరు గాంచిన అమరావతి అమరేశ్వరాలయం జనసముద్రాన్ని తలపించింది.

భక్తజనులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయింది. వి.ఐ.పిలు వచ్చిన సమయంలో క్యూలైన్లలోని సామాన్య భక్తులు ఒకింత అసహనానికి గురైనారు. భక్తులకు కె.పి.సి సిమెంటు వారు వాటర్ ప్యాకెట్లును, స్వచ్ఛంద సంస్థల వారు పులిహార, దద్దోజనం, కమ్మ సేవా సంఘం, అమరలింగేశ్వర కాపు సేవా సంఘం అన్నదానాలు, మంచినీటి సరాఫరా చేసి భక్తుల ఆకలిదప్పికతను తీర్చారు. అమరావతి గ్రామపంచాయితీ వారువీధులనుఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతూ మంచి నీటి కేంద్రాలను నిర్వహిస్తూ పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా తగిన విధంగా చర్యలు తీసుకున్నారు.

దేవాలయాధికారులు ఆలయంప్రాంగణమును,ఘాట్లనుపరిశుభ్రంగా ఉంచారు. మహాశివరాత్రి సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా అమరావతి సీ.ఐ వై అచ్చయ్య తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరావతిలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రాజావాసిరెడ్డి మురళీకృష్ణప్రసాద్, ఆర్.డి.ఓ రమాకాంత్ రెడ్డి, ఆలయాధికారి కర్రెక్టుల రేఖ, మండల తహాశీల్దార్ డానియల్, ఎంపీపీ మేకలహనుమంతరావు, ఎంపీడీవో పార్వతి తదితరులు పాల్గోన్నారు. అమరేశ్వరాలయంతోపాటు ధ్యానబుద్ధ ప్రాజెక్టు షిరిసాయి, వర్తిసాయి కపోతేశ్వర ద్యానమందిరం, క్రోసూరు రోడ్డులోని శ్రీశ్రీశ్రీ బాల త్రిపురసుందరీ దేవిఆలయం, పురావస్తు సంగ్రహాలయం, మహాచైత్యం, రామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో కళకళలాడాయి.

అమరేశ్వరుని సేవలో పలువురు వి.ఐ.పిలు..
మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా అమరేశ్వరుని రాష్ట్ర మాజీ మంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, స్థానికఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్,న్యాయమూర్తులు,పలు కోర్టుల జడ్జీలు హాజరై స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు.

click here to read more : Krishna District : శివోహం Andhra Prabha Spot News
