English Spell | నేషనల్ స్పెల్ బీ పోటీలకు ఎంపిక‌….

English Spell | నేషనల్ స్పెల్ బీ పోటీలకు ఎంపిక‌….

English Spell | నాగాయలంక – ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన స్టేట్ లెవల్ ఇంగ్లీష్ స్పెల్ బీ పోటీలలో నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం గ్రామ ఎం.పి.పి. స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాలను కైవసం చేసుకున్నారు. 3వ తరగతి విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించిన డి. జోత్స్నశ్రీ, 4వ తరగతి విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించిన జి. జితిన్ లు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన వీరిద్దరూ ఏప్రిల్ నెలలో ముంబైలో జరగనున్న “నేషనల్ స్పెల్ బీ” పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున పాల్గొననున్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపికవ్వడం పట్ల టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులను తీర్చిదిద్దిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. శ్యామ్ దివాకర్ ,ఉపాధ్యాయులు కె. మమతా కన్నా, ఎం. విజయలక్ష్మి లను టీడీపీ నేతలు అభినందించి విద్యార్థులను దుశ్శాలువతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, నాగాయలంక మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు, గ్రామ సర్పంచ్ అంబటి శ్యామ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉప్పల ప్రసాద్, మండల తెలుగు యువత అధ్యక్షుడు మేడికొండ విజయ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు తానంకి చంటి, మర్రిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు సనక సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply