7th Ward | ఆలేరు మున్సిపల్ చైర్మన్ గా బాలమణి..

7th Ward | ఆలేరు మున్సిపల్ చైర్మన్ గా బాలమణి..
7th Ward | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ నూతన చైర్మన్ గా 7 వ వార్డు నుండి ఎంపికైన కాంగ్రెస్ కౌన్సిలర్ బీజని బాలమణి భాస్కర్ ఎన్నిక కానున్నట్టు తెలిసింది. స్థానిక మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ మహిళకు కేటాయించబడింది. వైస్ చైర్మన్ పదవి కోసం 6 వ వార్డు నుండి ఎన్నికైన కాంగ్రెస్ కౌన్సిలర్ అంగడి అంజనేయులు, 9 వ వార్డ్ నుండి ఎంపికైన పస్తం ఆంజనేయులు తదితర పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈనెల 16న నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎంపిక జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపిక ప్రక్రియలో నిమగ్నమైంది. కో ఆప్షన్ సభ్యుల ఎంపిక పై కూడా అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. కాగా గెలుపొందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు క్యాంప్ కు వెళ్లినట్టు తెలిసింది.
