AP | ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ పై మండలిలో ర‌చ్చ‌ – స‌భ కార్య‌క్ర‌మాల‌కు ఆడ్డుప‌డ్డ వైసిపి

విద్యారంగ సమస్యలపై చ‌ర్చ‌కు ప‌ట్టు
వైసిపి వాయిదా తీర్మానాన్ని తిర‌స్క‌రించిన చైర్మ‌న్
స్వ‌ల్ప కాలిక చ‌ర్చ‌కు రెడీ అన్న నారా లోకేష్
రూ.4,500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారంటూ వైసిపికి ప్ర‌శ్న

వెల‌గ‌పూడి – విద్యారంగ స‌మ‌స్య‌ల‌పై వైసిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజు తిర‌స్క‌రించ‌డంపై ఆ పార్టీ స‌భ్యులు ఫైర్ అయ్యారు.. వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన , ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులపై నినాదాలు చేశారు. అంతే కాకుండా చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లి ప్లకార్డులతో నిరసనకు దిగారు వైసీపీ ఎమ్మెల్సీలు. దీంతో సభలో రచ్చ చోటు చేసుకుంది.

స‌ల్ప‌కాలిక చ‌ర్చ‌కు రెడీ ..

వైసీపీ ఆందోళనపై మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. షార్ట్ డిస్కషన్‌లో అన్నీ చర్చిద్దామన్నారు. రూ.4,500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారో వైసీపీ సభ్యులు చెప్పాలని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు పెంచుతారు.. వాళ్లే ధర్నా చేస్తారంటూ మండిపడ్డారు. అయితే మంత్రి చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో వైసీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా వైసిపి స‌భ్యులు స‌భాకార్య‌క్ర‌మాల‌కు అడ్డుప‌డ‌టంతో స‌భ‌ను వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *