helping |రాజ్ పాల్ పై చెక్-బౌన్స్ కేసు..రంగంలోకి బాలీవుడ్ స్టార్స్ …

helping |రాజ్ పాల్ పై చెక్-బౌన్స్ కేసు..రంగంలోకి బాలీవుడ్ స్టార్స్ …

helping |ఆంధ్ర ప్రభ,వెబ్ డెస్క్‌: బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ తీహర్ జైలు అధికారుల మందు లొంగిపోయారు. అసలు ఏం జరిగిందంటే రాజ్ పాల్ హస్య నటుడిగా మంచి గుర్తింపు ఉన్న సమయంలో 2010లో రాాజ్ పాల్ తన దర్శకత్వంలో అతా పతా లాపతా అనే సినిమాను తీశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలం అయ్యింది. అయితే సినిమా తీయడం కోసం మురళీ ప్రాజెక్టు అనే సంస్థ రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నాడు రాజ్ పాల్. దీంతో అప్పులు తీర్చలేక, ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో రాజ్ పాల్ ఆయన భార్య రాధా యాదవ్ చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు.

మురళీ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్ధ ఢిల్లీ మేజిస్టేట్ కోర్టును ఆశ్రయించింది. సదరు కోర్డు రాజ్ పాల్ దంపతులకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో రాజ్ పాల్ మేజిస్టేట్ కోర్టును సవాల్ చేస్తు ఢిల్లీ హైకోర్టును సంప్రదించాడు. కొంత సమయం ఇస్తే డబ్బులు తిరిగి చెలిస్తానని హమీ ఇవ్వడంతో ఇరువురు రాజీపడాలని కోర్టు సూచించింది. కానీ డబ్బులు చెల్లించలేదు, హైకోర్డు అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో తన వద్ద డబ్బులు లేవని కన్నీళ్లతో తీహర్ జైలులో లొంగిపోయారు.

ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ సెలబ్రెటీలు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. సోనూ సూద్ సాయం ప్రకటించారు. భవిష్యత్తులో తన సినిమాలో రాజ్ పాల్ యాదవ్ నటిస్తారని, అందుకుగానూ ఇప్పుడు కొంత మొత్తం ఆయనకు అందిస్తున్నానని సోనూ సూద్ తెలిపారు. ఇది సాయం కాదని, రాజ్ పాల్ యాదవ్ లోని నటుడికి గౌరవంగా ఇస్తున్న అడ్వాన్స్ అని పేర్కొన్నారు. తాజాగా జెమ్ ట్యూన్స్ మ్యూజిక్ అధినేత ఇంద్రజీత్ సింగ్ రాజ్ పాల్ కు రూ.1.1 కోట్ల సాయం అందించారు.


కష్టకాలంలో ఉన్న సహచరుడికి అండగా నిలవడం మనందరి బాధ్యత అని బాలీవుడ్ లోని మిగతా సెలబ్రెటీలు కూడా సాయం చేయాలని ఆయన కోరారు. అయితే సినీ పరిశ్రమలోని ఒక పెద్ద వర్గం రాజ్ పాల్ కు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చిందని మేనేజర్ గోల్డీ తెలిపారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ వంటి నటుల పేర్లను ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా నటుడు వరుణ్ ధావన్ కూడా సాయం అందిస్తారని, ఈ విషయాన్ని వరుణ్ తండ్రి, చిత్ర నిర్మాత డేవిడ్ ధావన్ తనతో చెప్పారని గోల్డీ వెల్లడించారు. దీంతో తర్వలోనే రాజ్ పాల్ యాదవ్ బయటకు అవకాశం ఉందని రాజ్ పాల్ మేనేజర్ గోల్డీ తెలిపారు.

Leave a Reply