MLA | అంగడీశ్వర ఆలయ అభివృద్ధికి సహకరిస్తా

MLA | అంగడీశ్వర ఆలయ అభివృద్ధికి సహకరిస్తా

  • ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు

MLA | కడెం( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : శ్రీ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకరిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు అన్నారు గురువారం కడెం మండలం ఏలగడప శివారులో గల అతి పురాతనమైన శ్రీ అంగడిశ్వర శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ చేతుల మీదుగా శ్రీ అంగడిశ్వర ఆలయ ఉత్సవ గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని,ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగేలా చూడాలని కమిటీ సభ్యులకు ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎలగడప గ్రామ సర్పంచ్ నర్సింగ్ అశ్విత రమేష్,ఆలయ కమిటీ అధ్యక్షులు ఏపూరి రాజ్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు ఎదులాపురం రాజశేఖర్, కోశాధికారి రాపర్తి నరసయ్య, మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ నాంపల్లి భూమరాజం ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply