Avanigadda | బాల్య వివాహాలు అనర్ధం : ఎంపీడీఓ

Avanigadda | అవనిగడ్డ – ఆంధ్రప్రభ : బాల్య వివాహాలు అనర్ధదాయకం అని అవనిగడ్డ ఎంపిడివో మరియదేవి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో బాల్య వివాహ విముక్తి రథాన్ని ఎంపిడివో ప్రారంభించారు. బాల్య వివాహాలు సామాజిక రుగ్మతగా ఆమె పేర్కొన్నారు. తెలిసి తెలియని వయసులో వివాహం చేయడం వలన వారి ఆరోగ్య పరిస్థితులు క్షీణిస్తాయని, తద్వారా బాలికల సంరక్షణకు ముప్పు వాటిల్లుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ పర్యవేక్షకురాలు వనజ, డిప్యూటీ ఎంపిడివోలు కె.చంద్రశేఖర్, పద్మావతి, కార్యాలయ సిబ్బందితో పాటు అవనిగడ్డ పంచాయతీ కార్యదర్శి తోట శ్రీనివాసరావు, వాసవ్య మహిళా మండలి సభ్యురాలు సిహెచ్ శాంతి పాల్గొన్నారు. అనంతరం మండలంలో వివిధ ప్రాంతాలలో బాల్య వివాహాలు అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రచారం చేశారు.
