తెలంగాణ సీఎం రేవంత్ ను ఈరోజు సినీ ప్రముఖులు కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మర్యాద పూర్వకంగా కలిశారు. గద్దర్ తెలంగాణ చలనచిత్ర పురస్కారాల విధివిధానాలను ముఖ్యమంత్రి ఆమోదించిన నేపథ్యంలో దిల్ రాజు కలిశారు.
మరోవైపు సినీనటులు మంచు మోహన్ బాబు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ ను కలిశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.