79 people | ఎన్నికలకు భారి బందోబస్తు ఏర్పాటు

79 people | ఎన్నికలకు భారి బందోబస్తు ఏర్పాటు

79 people | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : మున్సిపల్ సాధారణ రెండో విడుత ఎన్నికలకు భారి బందోబస్త్ ఏర్పాటు చేసినట్టు భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పొన్నం సత్యనారాయణ గౌడ్ తెలిపారు. నేడు జరుగనున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిపించేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

ఇద్దరు ఏసీపీలు వెంకటేశ్వర్ రెడ్డి, రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎనిమిది ఎస్సై లు, పదిమంది ఏ ఎస్సైలు, 79 మంది విమెన్, మెన్ పీసీ లను ఎన్నికల బందోబస్త్ లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పోలింగ్ బూత్ లకు వంద మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు రాజకీయ పార్టీ లు, నాయకులు సహకరించాలని సీఐ కోరారు.

నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి

భీంగల్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని సీఐ పొన్నం సత్యనారాయణ కోరారు. ప్రజాస్వామ్యం లో రాజ్యం కల్పించిన ఓటు హక్కుద్వార మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉందన్నారు. ఓటర్లు రాజకీయ నాయకులు అందించే ప్రలోభాలకు లొంగ కుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఓటర్లకు మద్యం, డబ్బులు, బహుమతుల పేరిట ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడడం చట్టరీత్యా నేరం అని ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కేసులు బుక్ చేయడం జరుగుతుందని, ఎవరైనా ఇలాంటివీ చేయడం జరిగితే నేరుగా పోలీసులకు, లేదా డయల్ 100 కు పిర్యాదు చేయాలని సూచించారు. పట్టణం లో మొత్తం 12 వార్డుల్లో 14045 మంది తమ ఓటు హక్కును నిర్భయంగా వేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, 6616 మంది పురుషులు, 7429 మంది మహిళలు తమ ఓటు హక్కును వారికి కేటాయించిన బూత్ లలో వినియోగించుకోవాలని సీఐ కోరారు.

Leave a Reply