Manthani l అభివృద్ధికి కట్టుబడి ఉంటాం..

Manthani l అభివృద్ధికి కట్టుబడి ఉంటాం..

మంథనిని అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచుతాం

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి

Manthani l మంథని, ఆంధ్ర ప్రభ: అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, మంథనిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తామని, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన సోమవారం మంథని లోని 13 వార్డుల్లో మంత్రి శ్రీధర్ బాబు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటింటికి పథకాల అందజేస్తామని స్పష్టం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారం,మౌలిక సదుపాయాల విస్తరణ,పారదర్శక పాలనతో పాటు సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని పార్టీ అభ్యర్థులు ప్రజలకు భరోసా ఇవ్వాలన్నారు. ప్రజల విశ్వాసం, ప్రజల ఆశీర్వాదాలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ ఘన విజయం సాధించి, మంథని పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఏ సంక్షేమం అర్హుల దరిచేరకుండా వారిని నమ్మించి మోసం చేసిన ఘనత ముమ్మాటికీ వారిదేనని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇచ్చి ఆకలి తీర్చామని చెప్పారు. ఇప్పటికే మంథని మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, మంథని పట్టణం రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. అభివృద్ధి కావాలంటే హస్తం గుర్తుకే ఓటేయాలని, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.

Leave a Reply