10 wards | కాంగ్రెస్, సిపిఐ, మిత్రపక్షాలను గెలిపించండి.

10 wards | కాంగ్రెస్, సిపిఐ, మిత్రపక్షాలను గెలిపించండి.
10 wards | చండూర్, ఆంధ్రప్రభ : చండూర్ మున్సిపాలిటిలో చండూరులో నిర్వహించిన సమరభేరి సభను మున్సిపల్ ఎన్నికల కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అంగడిపేట నుండి చండూరు పట్టణం సెంటర్ వరకు మహిళలు ప్రజలు భారీ ర్యాలీగా తరలివచ్చారు.
అనంతరం కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ…చండూరులో చాలా సమస్యలున్నాయని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత నాదే నని చండూరు పట్టణంలోని 10 వార్డుల కాంగ్రెస్, సిపిఐ మిత్రపక్ష సభ్యులను గెలిపించండి నేను అభివృద్ధి చేసి చూపిస్తానని, మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఇక్కడ ఓటు విలువ పెరిగిందని, నా ఎమ్మెల్యే పదవి త్యాగం వల్ల నాకు అన్యాయం జరిగిన మునుగోడు ప్రజలకు న్యాయం జరిగిందన్నారు.

దోపిడీకి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన గొంతు వినిపించే పరిస్థితి వస్తే నేను ముందుంటానని, కాంగ్రెస్ ప్రజా పాలనలో రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. సన్న బియ్యం ఇస్తున్నాం, చండూరు మున్సిపాలిటీలో ఇంటి స్థలాలు లేని నిరుపేదలందరికీ త్వరలోనే ప్రభుత్వ భూమిని గుర్తించి ఇల్లులు కట్టిస్తా రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే కొట్లాడుతూనే ఉంటాడని, పేద ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానన్నారు.
చండూరులో ఇప్పటివరకు 10% అభివృద్ధి మాత్రమే జరిగిందని, ఇంకో 90% అభివృద్ధి చేసుకోవాలని, నా బలం బలగం మునుగోడు ప్రజలు మీరు నా వెంట ఉంటే ఎంత దూరమైనా వెళ్తా కొట్లాడుటానని, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీ అభివృద్ధికి మీరు ఓటు వేయండని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సంధ్య రెడ్డి, చండూర్ మండల సర్పంచ్ లు, చండూర్ మున్సిపాలిటీ కౌన్సిల్ అభ్యర్థులు, మునుగోడు నియోజకవర్గంలోని మండల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
