ఆడబిడ్డగా ఆదరించింది..

ఆడబిడ్డగా ఆదరించింది..

అభివృద్ధి చేసుకుందాం..

పాల్వంచ 9 ఫిబ్రవరి (ఆంధ్రప్రభ): ఇంటి ఆడబిడ్డగా ప్రతి ఒక్కరు ఆదరించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ నాలుగవ డివిజన్ బిజెపి పార్టీ అభ్యర్థి చెరుకు భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం కేటీపీఎస్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ మార్పు కోసం బిజెపికి ఓటు వెయ్యాలని ఓటర్లను అభ్యసిస్తున్నారు. భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో అగ్ర దేశాలు సైతం భారతదేశం వైపు చూస్తున్నాయని అలాంటి గొప్ప నాయకుడు సారథ్యంలో బిజెపి పార్టీలో ఉండటం గర్వంగా ఉందని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరుగుతుందని అదేవిధంగా బిజెపి గెలిచిన చోట కేంద్ర నిధులతో అభివృద్ధి శరవేగంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు . అవినీతి పాలన పోవాలి నిజాయితీ పాలన రావాలంటే ప్రతి ఒక్కరు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply