Mahashivratri | అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ..

Mahashivratri | అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ..

Mahashivratri | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో ఉన్న జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున ఆ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు సాయిప్రసాద్, కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి ఈ పట్టువస్త్రాలను సమర్పించడం జరిగిందన్నారు.

కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరస్వామివార్ల దేవస్థానం ప్రధానార్చకులు కరుణాకర్ గురుకుల్, సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్, పర్యవేక్షకుడు నాగభూషణం, అర్చకులు, వేదపండితులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, అధికారులు, అర్చకులు, వేదపండితులు, శ్రీ కాళహస్తి దేవస్థానం అధికారులకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు మరియు వైదిక సిబ్బంది మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేయడం జరిగిందన్నారు.

Leave a Reply