shetti l 17వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా…

shetti l 17వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా…

అవకాశం ఇవ్వండి నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి
17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రాగంశెట్టి సతీష్ ప్రచార ప్రభంజనం..
‘హస్తం’ గెలుపు కోసం ముమ్మర ప్రచారం!

shetti l బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 17వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రాగంశెట్టి సతీష్ తన మద్దతుదారులు , పార్టీ కార్యకర్తలతో కలిసి వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి గెలుపు స్ఫూర్తితో, అదే ఉత్సాహంతో సతీష్ ఇంటింటికీ వెళ్లి ఓటర్ల ఆశీస్సులు తీసుకుంటున్నారు. గడప గడపకూ తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తూ, ‘హస్తం’ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

17వ వార్డును పట్టణంలోనే ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యమని రాగంశెట్టి సతీష్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సహకారంతో వార్డులో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలైన డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణం మరియు తాగునీటి ఎద్దడిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గత పదేళ్లలో వార్డు అభివృద్ధిని పాలకుల నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున భారీగా నిధులు రాబట్టి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు అవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకాల వల్ల మహిళలకు, సామాన్యులకు ఎంతో మేలు జరుగుతోందని, ఈ సంక్షేమ ఫలాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా మహిళలు ఆయనకు మంగళ హారతులతో స్వాగతం పలికి తమ పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తొంగల మల్లేష్ తో పలువురు కాంగ్రెస్ లీడర్లు, పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply