ఎమ్మెల్యే ఆదేశాలతో నాయకుల విస్తృత ప్రచారం

ఎమ్మెల్యే ఆదేశాలతో నాయకుల విస్తృత ప్రచారం
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ ఎమ్మెల్యే నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఉట్నూర్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొంతమందిగత కొద్ది రోజులుగా ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని విస్తృతంగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్తపల్లి మహేందర్ నిర్మల్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్, దంతన్ పెల్లి ఉపసర్పంచ్ మహమ్మద్ మోబిన్ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేసినట్లు వారు తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు ఖాయమని వారు పేర్కొన్నారు. ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రచారంలో మంచి స్పందన వస్తుందని ఉట్నూర్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉట్నూరుకు చెందిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొంటున్నారని వారు తెలిపారు.

