ఆడబిడ్డగ ఆశీర్వదించి గెలిపించండి.

ఆడబిడ్డగ ఆశీర్వదించి గెలిపించండి.
9వ వార్డును అభివృద్ధి చేయడమే మా లక్ష్యం
బీఆర్ఎస్ అభ్యర్థి శీలం రామశైలాజ మధులను భారీ మెజారిటీతో గెలిపించాలీ
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణరావు
ములుగు, ఆంధ్రప్రభ : ములుగు మున్సిపాలిటీలో ఎన్నికల హడావిడి రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా 9వ వార్డులో పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న శీలం రామశైలాజ మధులను గెలిపించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ దూకుడు పెంచింది. దీనిలో భాగంగా ఆదివారం టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులరి లక్ష్మణరావు తొమ్మిదవ వార్డు అభ్యర్థి శీలం రామ శైలజ మదుల తో కలిసి ఇంటింటి ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రజల మధ్యకు వెళ్లి… మీ ఆడబిడ్డలా ఆదరించి… గెలిపించండి…9వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తామంటూ ప్రజలకు అభయ హస్తం ఇస్తున్నారు.ప్రచారం మొదలుపెట్టిన నాటి నుంచే ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు.
కాలనీల్లో తిరుగుతూ తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్ల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. “ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాదు… వాటికి పరిష్కారం చూపించడమే తమ లక్ష్యం” అని చెబుతున్నారు.ప్రత్యేకంగా మహిళలు, యువత నుంచి శీలం రామశైలాజ మధుకు మంచి స్పందన లభిస్తుంది. “మహిళగా… వార్డు అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తా. ప్రభుత్వం ఇచ్చే నిధులను పూర్తి స్థాయిలో వినియోగించి… 9వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా” అంటూ ఆమె చెబుతున్న మాటలు ప్రజల్లో నమ్మకం పెంచుతున్నాయి.ఎన్నికల్లో మాటలకే పరిమితం కాకుండా… గెలిచిన వెంటనే చేయబోయే పనులపై కూడా ఆమె స్పష్టమైన ప్రణాళికను ప్రకటిస్తున్నారు.
