మూడవ వార్డులో జోరుగా ప్రచారం

మంథని, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు అభ్యర్థి శ్రీపతి బానయ్యను గెలిపించండి బాధ్యతాయుతమైన పాలను అందిస్తామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు పేర్కొన్నారు. ప్రచారంలో శ్రీపతి బానయ్య కు మద్దతుగా శ్రీను బాబు జోరుగా ముందుకెళ్తున్నారు. ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ హస్తం గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. ప్రచారంలో భాగంగా శ్రీపతి బానయ్య మాట్లాడుతూ…హస్తం గుర్తుకు ఓటెయ్యండి ప్రతి ఒక్కరికి అన్నలా అండగా ఉంటారని మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీపతి బానయ్య ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆయన గడపగడపన ప్రచారం చేస్తూ అందరికంటే ముందు ప్రచారంలో మెరుపు తీగల ముందుకు వెళ్తున్నారు. బానయ్య గెలుపు బారబరీ ఖాయమని పలువురు విశ్వసిస్తున్నారు.
మున్సిపల్ పరిధిలోని వార్డు ప్రచారంలో అందరి కంటే ముందున్నారు. హస్తం గుర్తుకు ఓటెయ్యాలని సేవకుడిలా పని చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. వార్డు సందర్శన ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా కార్యచరణ ఏర్పాటు చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరికీ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో 3వ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
