T20 world cup|పాక్‌కు చుక్క‌లు చూపించిన నెద‌ర్లాండ్‌

T20 world cup|పాక్‌కు చుక్క‌లు చూపించిన నెద‌ర్లాండ్‌

  • ఆఖ‌రి ఓవ‌ర్‌లో ఫాహిమ్ అష్రఫ్ మెరుపులు
  • ఓట‌మి నుంచి బ‌య‌ట‌ప‌డిన పాకిస్థాన్‌
  • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో మొద‌టి మ్యాచ్‌లోనే హైటెన్ష‌న్‌

T20 world cup|ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : పొట్టి వరల్డ్‌కప్ ప్రారంభ‌మైన మొద‌టి రోజు మొద‌టి మ్యాచ్ అభిమానుల‌కు హై టెన్షన్ పుట్టించింది. పాకిస్థాన్‌, నెద‌ర్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ ఉత్కంఠ‌ను రేకెత్తించింది. నెద‌ర్లాండ్ మొద‌ట బ్యాటింగ్ చేసి స్వ‌ల్ప స్కోరుకే ప‌రిమిత‌మైంది. దీనిని ఛేదించ‌డానికి పాకిస్థాన్ ఆప‌సోపాలు ప‌డింది. ఒకానోక ద‌శ‌లో పాక్ ఓడిపోతుంద‌నుకున్నారు. చివ‌ర్లో ఫాహిమ్ అష్రఫ్ ఆదుకోవ‌డంతో పాకిస్థాన్ ప‌రాజ‌యం నుంచి బ‌య‌ట ప‌డింది.

కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుని నెదర్లాండ్స్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. నెదర్లాండ్స్ జ‌ట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఒకానొక దశలో ఓట‌మి అంచున నిలిచింది. కానీ ఫాహిమ్ అష్రఫ్ ఒక్క ఓవర్‌లోనే 24 పరుగులు బాదడంతో పాకిస్తాన్ గెలుపొందింది. 11 బంతుల్లో 29 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు.

Leave a Reply