Jukkal | గురువు బ్రహ్మదేవుని స్వరూపం

Jukkal | గురువు బ్రహ్మదేవుని స్వరూపం

…శ్రీ గోపాల్ గోవింద్ మహారాజ్

Jukkal | జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : గురువు బ్రహ్మ దేవుని స్వరూపమని జుక్కల్ లో ప్రసిద్ధిగాంచిన శ్రీ గోవింద్ మఠ్ సంస్థాన్ మఠాధిపతి శ్రీ గోపాల్ గోవింద్ మహారాజ్ సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ రామాలయంలో శ్రీ దాసబోధ పారాయణం భక్తిశ్రద్ధలతో కొనసాగుతుంది. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి శ్రీ గోపాల్ గోవింద్ మహారాజ్ ప్రవచిస్తూ గురువు విశ్వస్వరూపమని,గురువు మంచిని బోధిస్తూ శిష్యులకు, భక్తులకు సన్మార్గం చూపటం జరుగుతుందన్నారు. టెక్నాలజీ వెర్రితలలు వేస్తుందని ప్రతి మానవుడు టెక్నాలజీని మంచి కోసం సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనవసరమైన టీవీ సీరియల్ చూస్తూ సమయాన్ని వృధా చేసుకోకుండా, ఎంతో కొంత సమయాన్ని దైవచింతల కోసం వెచ్చించాలన్నారు.

భక్తితోనే ముక్తి లభిస్తుందని, ఇహలోక జీవితం శాశ్వతం కాదని, పరలోక జీవితం శాశ్వతం కాబట్టి దానధర్మాలు చేస్తూ, తల్లిదండ్రులకు సేవలు చేస్తూ, చిన్నారులకు ప్రేమిస్తూ, స్వచ్ఛంద కార్యక్రమాలు పాల్గొంటూ ముందుకు సాగాలన్నారు, గురువును నమ్మి గురువు ఆదేశించిన ఉపదేశాలను పాటిస్తూ, గురువుచూపిన మార్గాన్ని అనుసరిస్తూ,ముందుకు సాగినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుందన్నారు. పాశ్చాత సంస్కృతిని విడనాడి భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను ఆచరించాలన్నారు. ఈ సందర్భంగా శ్రీ కేశవ్ గోపాల్ మహారాజ్,శ్రీ గోవింద్ గోపాల్ మహారాజ్,శ్రీ సోమనాథ్ మహారాజ్ శ్రీ శ్యామ్ మహరాజ్ తో పాటు ప్రముఖులు, కామారెడ్డిపట్టణ పెద్దలు, భక్తులు,ప్రజలు అశేషంగా పాల్గొన్నారు.

Leave a Reply