కాంగ్రెస్తో కలిసి నడవండి అభివృద్ధికి నడుము కట్టండి

మక్తల్ , ఆంధ్రప్రభ ; మక్తల్ పట్టణం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్తో కలిసి నడవండి అభివృద్ధికి నడుము కట్టండి అప్పుడే మక్తల్ పట్టణం అభివృద్ధి సాధ్యమవుతుందని ఎన్నికల్లో 1వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కట్ట సురేష్ కుమార్ గుప్తా అన్నారు. అభివృద్ధిని కోరుకునే వారు ఎవరైనా కాంగ్రెస్తోనే కలిసి రావాలని అన్నారు .కాంగ్రెస్ పార్టీ తప్ప మరో పార్టీతో అభివృద్ధి చేయడం సాధ్యం కాదన్నారు. మరి అభివృద్ధికి అండగా నిలుస్తారా? లేదా నిర్ణయించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 1వ వార్డు పరిధిలో కాంగ్రెస్ నాయకులు ఆర్యవైశ్య సంఘం సభ్యులతో కలిసి గడపగడపకు వెళ్లి ప్రచారాన్ని ముమ్మరం చేశారు .వార్డు పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి అక్కడి సమస్యలను తెలుసుకోవడమే కాకుండా సమస్యల పరిష్కారానికి మార్గం చూయిస్తూ అభివృద్ధి కోసం తనకు అండగా నిలిచి గెలిపించాలని కోరుతున్నారు. దశాబ్దాల తర్వాత మక్తల్ బిడ్డ ఎమ్మెల్యే అయ్యాడు అంతేకాదు మంత్రిగా ఉన్నాడు ఈ సమయంలో అభివృద్ధి చేసుకోవడం మన అందరి బాధ్యత ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు తీసుకొచ్చే బాధ్యత మంత్రిది పనులు చేయించుకునే బాధ్యత ప్రజలందరిని అన్నారు.
అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను 1వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించాలని అదేవిధంగా 16 వార్డుల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం వల్ల పూర్తిస్థాయిలో పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కట్టా సురేష్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో పట్టణంలో సిసి రోడ్లు మురుగు కాలువలు తాగునీటి పైప్ లైన్ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి మంత్రి వద్ద పక్కా ప్లాన్ ఉందని మున్సిపల్ ఎన్నికల తర్వాత శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారమయ్యే దిశగా పనులు ప్రారంభమవుతాయని అన్నారు.
అదేవిధంగా పట్టణంలోని 16 వార్డుల్లో ప్రతి గల్లీలో సిసి రోడ్డు సైడ్ డ్రైన్స్ పూర్తి చేయడమే లక్ష్యంగా మంత్రి వాకిటి శ్రీహరి కృషి చేస్తున్నారన్నారు. ఆయన మరింత పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మున్సిపల్ పగ్గాలను అందించి మంత్రి వాకిటి శ్రీహరికి కానుకగా ఇవ్వాలని చైర్మన్ అభ్యర్థి 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కట్టా సురేష్ కుమార్ గుప్త విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పసుల రంజిత్ రెడ్డి,మేదరి శ్రీనివాసులు ఇతర నాయకులు ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
