Jharkhand | హైకోర్టు లాయర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం

Jharkhand | హైకోర్టు లాయర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం

ఒకరు మృతి

Jharkhand | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఝార్ఖండ్ హైకోర్టు లాయర్ స్నేహ అఖౌరి, తన కుమారుడు, కుమార్తెతో కలిసి రాంచీలోని అశోక్ నగర్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ఆమె కుమారుడు మిహిర్ మృతిచెందగా, లాయర్ స్నేహ అఖౌరి, ఆమె కుమార్తె విషం తీసుకోవడంతో పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం ఇంట్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

గత కొంతకాలంగా స్నేహా కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యాయత్నానికి కారణమా లేక మరేదైనా ఉందా అన్న కోణంలో అర్గోరా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply