TG | గులాబి జెండా ఎగరాలి …

TG | గులాబి జెండా ఎగరాలి …

  • జనగామ మున్సిపల్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి …

TG | జనగామ, ఆంధ్రప్రభ : జనగామ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈ రోజు పట్టణ కేంద్రంలోని 1,2,3,4,14,15 వార్డులలోను పార్టీ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల్లోకి వచ్చిన ఎమ్మెల్యే పల్లా కు స్థానిక ప్రజలు, తిలకం దిద్దుతూ, మంగళ హారతులు ఇస్తూ, డప్పు వాయిద్యాల మధ్యన, పూల వర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ గులాబి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే జనగామ ప్రాంతం అభివృద్ధి చెందిందని, జిల్లా కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి ల ఏర్పాటులతో ఎంతో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పథకం అమలులో చిత్తశుద్ధి కరువైందన్నారు. జనగామ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే మోగ్గు చూపారన్నారు. ఈ కార్యక్రమంలో పలు వార్డులలోని కౌన్సిలర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, వార్డు ఇన్చార్జిలు పలువురు పాల్గొన్నారు..

Leave a Reply