MP | శ్రీ‌వారి సేవ‌లో..

MP | శ్రీ‌వారి సేవ‌లో..

  • తిరుమ‌లలో ఎంపీ కేశినేని శివ‌నాథ్ కుటుంబం

MP | విజయవాడ, ఆంధ్రప్రభ : తిరుమల వేంకటేశ్వర స్వామివారిని ఈ రోజు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కుటుంబ సమేతంగా ద‌ర్శించుకున్నారు. స‌తీమ‌ణి కేశినేని జాన‌కీ ల‌క్ష్మీ, కుమారుడు కేశినేని వెంక‌ట్, కుమార్తె కేశినేని స్నిగ్ధ ల‌తో పాటు టీడీపీ నాయకుల‌తో క‌లిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తిరుమల చేరుకున్న ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొని, భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆయ‌న వెంట ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు క‌రీముల్లా, తెలుగుదేశం పార్టీ గంప‌ల గూడెం మండ‌లం అధ్యక్షుడు మానికొండ రామ‌కృష్ణ ( ఆర్.కె) ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply