Meeting | మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం

Meeting | మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం
- జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
- కలెక్టర్‌తో ఎలక్షన్ సాధారణ అబ్జర్వర్ భేటీ
Meeting | జనగామ టౌన్ , జనవరి 30 ( ఆంధ్రప్రభ ) : జనగామ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. ఈ రోజు కలెక్టరేట్‌లో మున్సిపల్ ఎలక్షన్ నిర్వహణ ఏర్పాట్లపై ఎన్నికల సాధారణ అబ్జర్వర్ ఎ. నర్సింహరెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలో జనగామ మున్సిపాలిటీ 30 వార్డులు, స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీలలో 18 వార్డుల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్ల పై కలెక్టర్ వివరించారు.
ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు గ్రామపంచాయితీ ఎన్నికల్లో విధులు నిర్వహించిన టీచర్లను, రెవెన్యూ, ఇజిఎస్ పనిచేస్తున్న అధికారులను నియమించామని ఆయన తెలిపారు. ఎన్నికల నిబంధనలకనుగుణంగా పూర్తిస్ధాయి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. ఈ భేటీలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, జెడ్పీ సీఈఓ మాదురి షా, జనగామ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ మాతృనాయక్ పాల్గొన్నారు.
